Back to feed
వైరల్ వార్తలుBreaking
ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు బోల్తా
Priya Singh Jun 07, 2026 5:35 AM మంచిర్యాల 19 views1 day ago
మంచిర్యాల జిల్లా మందమర్రి వద్ద ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. కొత్తగూడెం నుంచి బెల్లంపల్లి వైపు వెళ్తున్న ఈ బస్సు.. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో ఈ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. అయితే, అదృష్టవశాత్తూ ప్రమాద సమయంలో బస్సులో కేవలం ఒక్క ప్రయాణికుడు మాత్రమే ఉండటంతో పెను ప్రాణనష్టం తప్పింది.
ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు ఆ ప్రయాణికుడికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకున్నారు.
Comments
Loading comments...



