Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

త్వరలో దేశవ్యాప్తంగా కార్గో విమానాశ్రయాలు

Rahul Joshi Jun 06, 2026 10:23 AM విశాఖపట్నం 23 views2 days ago
త్వరలో దేశవ్యాప్తంగా కార్గో విమానాశ్రయాలు - Udayam Digital
దేశంలో సరకు రవాణాను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్గో విమానాశ్రయాలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు తెలిపారు. 'ఒక విమానాశ్రయం.. ఒక ఉత్పత్తి' విధానంతో స్థానిక ఉత్పత్తులను ఎగుమతి చేసేలా కొత్త పాలసీని రూపొందిస్తున్నామని ఆయన వెల్లడించారు. పీఎం గతిశక్తి పథకం కింద పలు విమానాశ్రయాల్లో కార్గో టెర్మినళ్లు నిర్మిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. 2047 నాటికి దేశంలోని విమానాశ్రయాల సంఖ్యను 350కి పెంచడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. సముద్ర ఉత్పత్తుల ఎగుమతులకు విమానయాన శాఖ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.

Comments

G
Loading comments...