Back to feed
ఢిల్లీకి చంద్రబాబు, పవన్: ప్రధాని మోదీతో ఎన్డీఏ భేటీ
Priya Singh Jun 08, 2026 11:21 AM అమరావతి 4 viewsabout 7 hours ago

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగే ఎన్డీఏ ముఖ్యమంత్రుల సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం మూడోసారి బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ భేటీలో కేంద్ర పథకాల అమలు, రాష్ట్రాల సమన్వయంతో పాటు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై చర్చించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలు మరియు కీలక ప్రాజెక్టులపై కేంద్ర పెద్దలతో చర్చించే అవకాశం ఉంది.
Comments
Loading comments...



