Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరులో అనుమానాస్పద పార్సిళ్లపై ప్రత్యేక తనిఖీలు

Follow Udayam Digital on Google
s. j. dineshkumar Jul 27, 2026 8:56 PM చిత్తూరుక్రైమ్
చిత్తూరులో అనుమానాస్పద పార్సిళ్లపై ప్రత్యేక తనిఖీలు - Udayam Digital
చిత్తూరు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు డి ఎస్ పి జె. వెంకటనారాయణ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ చిన్నపెద్దయ్య, ఎస్‌ఐ మరెప్ప బృందం ఆర్‌టీసీ బస్టాండ్, ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయం, పలు కొరియర్ కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టింది. పార్సిళ్ల బుకింగ్ సమయంలో పంపిన, స్వీకరించే వ్యక్తుల అనుమానాస్పద పార్సిళ్లు లేదా వ్యక్తులపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజలు అనుమానాస్పద సమాచారం ఉంటే డయల్-112 ఇవ్వాలన్నారు .

Comments

G
Loading comments...