వార్తలకు తిరిగి వెళ్లండి

అందాల తార జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన తొలి పూర్తి స్థాయి హారర్ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నాట్ అవుట్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఈ నెలాఖరులోనే ప్రారంభం కానుందని ఆమె సన్నిహిత వర్గాలు తాజాగా వెల్లడించాయి.
హారర్, ఎమోషన్, మ్యూజిక్ కలబోతగా ఈ చిత్రం రూపొందనుంది. ఇందులో జాక్వెలిన్ సరసన ఇద్దరు హీరోలు నటించనుండగా, చాలా కాలంగా ఎదురుచూస్తున్న వైవిధ్యమైన స్క్రిప్ట్ దొరకడంతో ఆమె ఈ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పినట్లు సమాచారం.
Comments
Loading comments...
