వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాగల రెండు మూడు రోజుల్లో ఏపీవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని, పలు ప్రాంతాల్లో తీవ్రమైన ఈదురుగాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తం చేసింది.
ముఖ్యంగా అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, నంద్యాల, కడప, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భీకర గాలులతో కూడిన అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Comments
Loading comments...
