వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

చిత్తూరులోని ప్రైవేట్ విద్యాసంస్థలు వ్యాపార ధోరణి వీడి, పుస్తకాలు, యూనిఫామ్ పేరిట అధిక ఫీజులు వసూలు చేయడం ఆపాలని ఏబీవీపీ పత్రికా ప్రకటన విడుదల చేసింది. కోచింగ్ సెంటర్లలో ఫైర్ సేఫ్టీ కల్పించాలని, సర్కారీ కళాశాలల్లో వసతులు మెరుగుపరచాలని జిల్లా కన్వీనర్ సన్న హర్షవర్ధన్ డిమాండ్ చేశారు. సమస్యలు తీర్చకుంటే శాంతియుత పోరాటాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...
