Back to feed
రూ.లక్ష కోట్ల భూముల రక్షణ: హైడ్రా
Neha Singh Jun 08, 2026 11:24 AM హైదరాబాద్ 4 viewsabout 7 hours ago

గడిచిన రెండేళ్లలో కబ్జాదారుల నుంచి రూ. లక్షా 10 వేల కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలు, చెరువులను రక్షించినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. వచ్చే ఏడాదికి ఈ సంఖ్య రూ. 2 లక్షల కోట్లకు చేరుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
నగరంలో పర్యావరణ సమతుల్యతను కాపాడటమే హైడ్రా ప్రధాన లక్ష్యమన్నారు. ఇటీవల కోకాపేట, పుప్పాలగూడ పరిసరాల్లో వేలాది కోట్ల భూములను రక్షించి, ఫెన్సింగ్ వేసి బోర్డులు ఏర్పాటు చేసినట్లు రంగనాథ్ వివరించారు.
Comments
Loading comments...


