వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రామోజీరావు వర్ధంతి సందర్భంగా గొల్లపూడిలో ఆయనకు నివాళులర్పించారు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి అసామాన్య శిఖరాలను అధిరోహించిన మహనీయుడు రామోజీరావు అని దేవినేని కొనియాడారు.
తెలుగు జర్నలిజానికి దిశానిర్దేశం చేస్తూ విలువలతో కూడిన పత్రికారంగానికి ఆయన నిదర్శనంగా నిలిచారన్నారు. 'అన్నదాత' ద్వారా రైతులకు సేవ చేస్తూ, ప్రతి రంగంలో నాణ్యత, నిబద్ధతతో ప్రజల నమ్మకాన్ని సంపాదించారని పేర్కొన్నారు.
Comments
Loading comments...
