వార్తలకు తిరిగి వెళ్లండి

స్థూల అనిశ్చితుల కారణంగా ఈ ఏడాది ఐపీఓ మార్కెట్ మందగించింది. 2026లో ఇప్పటివరకు కేవలం 23 సంస్థలు మాత్రమే పబ్లిక్ ఇష్యూలకు వచ్చి, రూ.27,000 కోట్లు సమీకరించాయని ఈక్విరస్ క్యాపిటల్ తెలిపింది. గత ఏడాదితో (103 ఐపీఓలు, రూ.1.76 లక్షల కోట్లు) పోలిస్తే ఈ నిధుల సేకరణ చాలా తక్కువ.
కాగా, టర్టెల్‌మింట్ ఐపీఓ జూన్ 19న, లియోటెక్ ఎస్‌ఎమ్‌ఈ ఐపీఓ జూన్ 17న ప్రారంభం కానున్నాయి. మరోవైపు, ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో తన క్యాష్ లాజిస్టిక్స్ ఐపీఓ ప్రణాళికను వాయిదా వేస్తున్నట్లు ఎస్‌ఐఎస్ సంస్థ ప్రకటించింది.
Comments
Loading comments...
