వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కొడిమ్యాల మండలం కొనాపూర్ గ్రామంలో వీధి కుక్కల దాడిలో గొర్రెల కాపరి మిరపల పర్వతాలుకి చెందిన 25 గొర్రెలు మృతి చెందగా, 20 గాయపడ్డాయి.
ఈ ఘటనపై చొప్పదండి ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం స్పందించి, బాధితుడికి ఫోన్ చేసి పరామర్శించారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం ద్వారా తగిన ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం త్వరగా స్పందించి ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...
