Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

భారత్ వద్ద 190 అణ్వాయుధాలు: సిప్రి నివేదిక

Vikram Chandra Jun 08, 2026 12:19 PM అల్ ఇండియా 7 viewsabout 5 hours ago
భారత్ వద్ద 190 అణ్వాయుధాలు: సిప్రి నివేదిక - Udayam Digital
భారత్ తన అణ్వాయుధ సంపత్తిని 190కి పెంచుకుందని స్టాక్‌హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధన సంస్థ (సిప్రి) వెల్లడించింది. పొరుగు దేశమైన పాకిస్థాన్‌ (170) కంటే భారత్ వద్ద 20 ఆయుధాలు ఎక్కువగా ఉన్నాయి. ఏడాది కాలంలో భారత్ కొత్తగా 10 వార్‌హెడ్లను తన ఆయుధాగారంలోకి చేర్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా చైనా వద్ద 620 అణ్వాయుధాలు ఉండగా, రష్యా, అమెరికాలు అత్యధిక ఆయుధాలతో మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. అలాగే, అంతర్జాతీయంగా రక్షణ రంగ వ్యయంలో భారత్ 92.1 బిలియన్ డాలర్లతో ఐదో స్థానంలో కొనసాగుతోందని సిప్రి తాజా వార్షిక నివేదికలో స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...