Back to feed
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం: ఎనిమిది మంది మృతి
Rohit Sardana Jun 08, 2026 1:05 PM అల్ ఇండియా 4 viewsabout 4 hours ago

విశాఖ స్టీల్ ప్లాంట్‌లోని ఎస్ఎంఎస్-2 విభాగంలో సోమవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. సుమారు 1500 డిగ్రీల వేడితో ఉన్న హాట్‌మెటల్ లిక్విడ్ బకెట్లు కూలి, పేలడంతో ఎనిమిది మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులలో మల్లికార్జున రావు, శ్రీనివాసరావు సహా ఆరుగురిని అధికారులు గుర్తించారు.
ఈ ప్రమాదంలో మరికొందరు కార్మికులు లోపల చిక్కుకుపోగా, కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్లాంట్‌లో భారీగా మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేస్తున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...



