Back to feed
భారత్ వద్ద 190 అణ్వాయుధాలు
Ravi Shukla Jun 08, 2026 12:29 PM అల్ ఇండియా 8 viewsabout 5 hours ago

ఈ ఏడాది జనవరి నాటికి భారత్ వద్ద 190 అణ్వాయుధాలు ఉన్నట్లు సిప్రి (SIPRI) నివేదిక వెల్లడించింది. ఇది పొరుగుదేశమైన పాకిస్థాన్ (170) కంటే 20 ఆయుధాలు ఎక్కువ. గడిచిన ఏడాది కాలంలో భారత్ కొత్తగా 10 అణు వార్‌హెడ్లను పెంచుకుంది.
ఇక ప్రపంచవ్యాప్తంగా రష్యా (5,420), అమెరికా (5,042) అత్యధిక అణ్వాయుధాలతో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. చైనా వద్ద 620 ఆయుధాలు ఉండగా, ప్రపంచంలోని 9 అణు దేశాల వద్ద మొత్తం 12 వేలకు పైగా అణ్వాయుధాలు ఉన్నట్లు నివేదిక పేర్కొంది.
Comments
Loading comments...



