వార్తలకు తిరిగి వెళ్లండి

సినీ నటి జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకున్న ఆమె, గురువారం ఉదయం నటి మహేశ్వరితో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు.
దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆమెకు వేదాశీర్వచనం చేసి, తీర్థప్రసాదాలు అందజేశారు. జాన్వీ, రామ్‌చరణ్ జంటగా నటించిన ‘పెద్ది’ చిత్రం గురువారమే విడుదలైన సంగతి తెలిసిందే.
Comments
Loading comments...
