వార్తలకు తిరిగి వెళ్లండి

భక్తుల రద్దీ దృష్ట్యా శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం నుండి సోమవారం వరకు స్వామివారి స్పర్శ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రోజుల్లో భక్తులకు కేవలం మల్లికార్జున స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.
అయితే, ఇప్పటికే ఆన్‌లైన్ ద్వారా స్పర్శ దర్శన టికెట్లు పొందిన భక్తులకు మాత్రం యథావిధిగా అనుమతి ఉంటుందని ఈవో వెల్లడించారు. వీకెండ్‌లో సాధారణ భక్తుల రద్దీ విపరీతంగా పెరిగే అవకాశం ఉండటంతో ముందస్తుగా ఈ ఏర్పాట్లు చేశారు.
Comments
Loading comments...
