వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల కొండపై భక్తుల రద్దీ క్రమంగా తగ్గుముఖం పట్టింది. జూన్ 2 నాటికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్ల సంఖ్య 16కి తగ్గింది. టైమ్ స్లాట్ సర్వదర్శనం, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు 3 గంటల్లోనే స్వామివారి దర్శనం లభిస్తోంది.
ఉచిత దర్శనానికి మాత్రం భక్తులు 10 గంటల పాటు వేచి ఉండాల్సి వస్తోందని టీటీడీ తెలిపింది. కాగా, నిన్న ఒక్కరోజే 83 వేల మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, హుండీ ద్వారా రూ.3.87 కోట్ల ఆదాయం సమకూరింది.
Comments
Loading comments...
