Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కడం ప్రాజెక్టులో క్రమంగా పెరుగుతున్న నీటిమట్టం

Follow Udayam Digital on Google
p.g.murthy Jul 28, 2026 8:22 AM మంచిర్యాలబ్రేకింగ్ న్యూస్
కడం ప్రాజెక్టులో క్రమంగా పెరుగుతున్న నీటిమట్టం - Udayam Digital
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కడెం ప్రాజెక్టులో నీటిమట్టం పెరుగుతుంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా మంగళవారం ఉ. 6 గంటలకు 682.40 అడుగుల నీటిమట్టం ఉంది. ప్రాజెక్టులోకి 313 క్యూసెక్కుల నీరు వస్తుండగా, దిగువకు 66 క్యూసెక్కులు నీటిని వదులుతున్నారు. గత సంవత్సరం ప్రాజెక్టులో 694 అడుగుల నీటిమట్టం ఉండేదన్నారు. భారీ వర్షాలు పడితే ప్రాజెక్టులో నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని వారన్నారు. వర్షాలలేమిటో ఇబ్బంది పడుతున్న రైతులకు కడెం ప్రాజెక్టు నిండితే నైనా సాగునీరు విడుదలవుతుందని కోటి ఆశలు పెట్టుకున్నారు.

Comments

G
Loading comments...