వార్తలకు తిరిగి వెళ్లండి

రూ. 80 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకుపోతున్న మరాఠీ చిత్రం ‘దేవూల్ బంద్ 2’ సజావుగా విడుదలవడానికి బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ చేసిన ఉదార సాయమే కారణమని దర్శకుడు ప్రవీణ్ తార్డే వెల్లడించారు.
సినిమా డీసీపీ వర్క్ కోసం రూ. 45 లక్షల బిల్లు కాగా, తమ వద్ద కేవలం రూ. 12 లక్షలే ఉన్నాయని తెలిసి షారుఖ్ ఆ బిల్లు మొత్తాన్ని పూర్తిగా మాఫీ చేశారని ఆయన పేర్కొన్నారు. ఆపత్కాలంలో ఎలాంటి గ్యారెంటీ లేకుండా షారుఖ్ చేసిన ఈ గొప్ప సాయాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని దర్శకుడు భావోద్వేగానికి లోనయ్యారు.
Comments
Loading comments...
