వార్తలకు తిరిగి వెళ్లండి

బాలీవుడ్ అగ్ర నటుడు సల్మాన్ ఖాన్ ‘కాలా హిరణ్’ చిత్ర విడుదలపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన హావభావాలు, ఆహార్యాన్ని పోలిన పోస్టర్లతో రూపొందుతున్న ఈ సినిమా తన వ్యక్తిత్వ హక్కులకు తీవ్ర భంగం కలిగిస్తోందని పిటిషన్‌లో పేర్కొన్నారు.
కృష్ణ జింకల వేట కేసు ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్ర నిర్మాతల వాదనలను కోరుతూ ధర్మాసనం తాజాగా నోటీసులు జారీ చేసింది. ఈ వివాదాస్పద కేసు తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల 19కి వాయిదా వేసింది.
Comments
Loading comments...
