Back to feed
భారత్ వాణిజ్య విధానంపై ట్రంప్ అసహనం
Sonia Singh Jun 05, 2026 6:01 AM అల్ ఇండియా 15 views4 days ago

ప్రధాని మోదీ మంచి మిత్రుడని కొనియాడిన డొనాల్డ్ ట్రంప్, అదే సమయంలో భారత్ అనుసరిస్తున్న సుంకపు విధానాలను తప్పుబట్టారు. గతంలో భారత్ భారీ సుంకాలను విధించి అమెరికానుంచి లబ్ధి పొందిందని ఆయన విమర్శించారు.
ప్రస్తుతం ఆ పరిస్థితి మారిందని, భారత్ నుంచి అమెరికా ప్రయోజనం పొందుతోందని ట్రంప్ పేర్కొన్నారు. త్వరలోనే ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారు కాగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...



