వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్‌ఎస్ నేతలు తెలంగాణను దోచుకుని పేదల సొమ్మును కాజేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. పదేళ్ల అధికారంలో సన్నబియ్యం ఇవ్వని వారు, ఇప్పుడు ప్రభుత్వంపై అభాండాలు వేస్తున్నారని మండిపడ్డారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తాము సంక్షేమం, అభివృద్ధిని ఆపడం లేదని స్పష్టం చేశారు.
ఇప్పటికే 76 వేల ఉద్యోగాలు ఇచ్చామని, రుణమాఫీతో పాటు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టును గాలికొదిలేసిందని, తాము నిధులిచ్చి పనులు వేగవంతం చేశామని భట్టి పేర్కొన్నారు.
Comments
Loading comments...
