Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

35 మంది జేఎల్స్‌కు షోకాజ్‌ నోటీసులు

Follow Udayam Digital on Google
ధీరజ్ రెడ్డి Aug 08, 2026 6:00 PM సిద్దిపేటతెలంగాణ
నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాల్లో చేరినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 35 మంది జూనియర్‌ లెక్చరర్లకు తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. వీరిలో సిద్దిపేట జిల్లాకు చెందిన ముగ్గురు ఉన్నారు. గజ్వేల్‌, చిన్నకోడూరు, చేర్యాల ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పనిచేస్తున్న వీరు వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని బోర్డు ఆదేశించింది. ఈ వ్యవహారంపై విచారణను వేగవంతం చేసింది.

Comments

G
Loading comments...