Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.9,500 కోట్ల ఐపీఓకు కోకాకోలా సిద్ధం

Follow Udayam Digital on Google
విఘ్నేష్ రెడ్డి Jul 02, 2026 3:44 PM ఆల్ ఇండియామార్కెట్లు
రూ.9,500 కోట్ల ఐపీఓకు కోకాకోలా సిద్ధం - Udayam Digital
ప్రముఖ శీతలపానీయాల సంస్థ కోకాకోలా తన భారతీయ బాటిలింగ్ యూనిట్ 'హిందుస్థాన్ కోకాకోలా బేవరేజెస్'ను ఐపీఓకు తీసుకురావాలని భావిస్తోంది. దీని ద్వారా దాదాపు రూ.9,500 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. ఇందుకోసం ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులను సంస్థ ఆహ్వానించింది. ఎల్‌జీ, హ్యుందాయ్ తరహాలోనే కోకాకోలా కూడా తన భారత అనుబంధ సంస్థను పబ్లిక్ ఇష్యూకు తీసుకురావడం గమనార్హం.

Comments

G
Loading comments...