వార్తలకు తిరిగి వెళ్లండి

నటుడు మంచు మనోజ్ హైదరాబాద్‌లోని మాతృదేవోభవ అనాథ ఆశ్రమాన్ని సందర్శించి అక్కడ ఉన్న వారిని ఆశ్చర్యపరిచారు. ఆశ్రమ నిర్వాహకుడు గిరి సోషల్ మీడియా ద్వారా చేసిన అభ్యర్థనకు తక్షణమే స్పందించిన మనోజ్, ఉదయమే అక్కడికి చేరుకుని అందరినీ ఆప్యాయంగా పలకరించారు.
ఆశ్రమానికి అవసరమైన టేబుళ్లు, కుర్చీలను మనోజ్ స్వయంగా అందజేశారు. మతిస్థిమితం లేని వారిని ఆదరిస్తూ గిరి చేస్తున్న సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా ఆయన ఎంతో అభినందించారు.
Comments
Loading comments...
