Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమ బెంగాల్‌లో భారీ అగ్నిప్రమాదం: 4 వేల ఈవీఎంలు నష్టం

Follow Udayam Digital on Google
Priya Singh Jun 12, 2026 11:37 AM ఆల్ ఇండియాజాతీయ
పశ్చిమ బెంగాల్‌లో భారీ అగ్నిప్రమాదం: 4 వేల ఈవీఎంలు నష్టం - Udayam Digital
పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో జరిగిన ఒక ఘోర అగ్నిప్రమాదంలో ఏకంగా 4 వేల ఈవీఎంలు కాలిబూడిదయ్యాయి. జిల్లా పరిషత్ కార్యాలయం ఉన్న ఒక భవనంలో అనుకోకుండా మంటలు చెలరేగడంతో, అందులోని ఈవీఎంలతో పాటు ఇతర ప్రభుత్వ సామాగ్రి కూడా పూర్తిగా దహనమైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పది నియోజకవర్గాల్లో వాడిన ఈవీఎంలను ఈ భవనంలో భద్రపరిచినట్లు రాష్ట్ర మంత్రి కౌశిక్ చౌదరి తెలిపారు. పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...