Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెట్రోల్ బంకులపై కేంద్రం కొత్త ఆంక్షలు

Follow Udayam Digital on Google
Priya Singh Jun 12, 2026 12:20 PM ఆల్ ఇండియాజాతీయ
పెట్రోల్ బంకులపై కేంద్రం కొత్త ఆంక్షలు - Udayam Digital
రిటైల్ పెట్రోల్ బంకుల్లో భారీ మొత్తంలో ఇంధన విక్రయాలపై కేంద్రం 90 రోజుల నిషేధం విధించింది. ఇకపై ఒక వాహనానికి రోజుకు 200 లీటర్లకు మించి డీజిల్ పోయకూడదని నిబంధన పెట్టింది. అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధన లభ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు కేవలం బల్క్ సరఫరా కేంద్రాల నుంచే ఇంధనం కొనుగోలు చేయాలని ఆదేశించింది. ఈ కొత్త నిబంధన వల్ల సాధారణ వాహనదారులకు, రైతులకు ఇంధన సరఫరా ఎటువంటి ఆటంకం లేకుండా అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...