వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలో పెట్రోల్ కంటే డీజిల్ అమ్మకాలపైనే ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఊహించని స్థాయిలో భారీగా నష్టపోతున్నాయి. పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు మండిపోవడమే ఇందుకు ప్రధాన కారణమని కేంద్ర పెట్రోలియం శాఖ వెల్లడించింది.
ప్రస్తుతం కంపెనీలకు లీటర్ డీజిల్‌పై రూ.30 నష్టం వస్తుండగా, పెట్రోల్‌పై కేవలం రూ.6 నష్టం మాత్రమే వస్తోంది. పెట్రోల్‌తో పోలిస్తే డీజిల్ వల్ల ఐదు రెట్లు ఎక్కువ భారాన్ని భరిస్తుండటం ఆయిల్ సంస్థల లాభాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
Comments
Loading comments...
