Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రతా కారణాలతో మెస్సి భారీ విగ్రహం తొలగింపు

Follow Udayam Digital on Google
Ravi Kumar Jun 02, 2026 11:16 AM ఆల్ ఇండియాజాతీయ
భద్రతా కారణాలతో మెస్సి భారీ విగ్రహం తొలగింపు - Udayam Digital
కోల్‌కతాలోని లేక్‌టౌన్ ప్రాంతంలో ఉన్న అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి 70 అడుగుల భారీ విగ్రహాన్ని అధికారులు తొలగించారు. ఇటీవల వీచిన ఈదురుగాలులకు విగ్రహం ఊగుతుండటంతో ప్రమాద నివారణ చర్యల్లో భాగంగా పిడబ్ల్యూడి అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. గతేడాది డిసెంబర్‌లో ఏర్పాటు చేసిన ఈ విగ్రహ నిర్మాణంలో లోపాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే దీనిని పూర్తిగా తొలగించట్లేదని, మరో సురక్షిత ప్రాంతంలో పునఃప్రతిష్ఠిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...