Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాయుడుపల్లి వద్ద ఘోర ప్రమాదం

Follow Udayam Digital on Google
Rajdeep Sardesai Jun 14, 2026 9:06 AM చిత్తూరుఆంధ్రప్రదేశ్
నాయుడుపల్లి వద్ద ఘోర ప్రమాదం - Udayam Digital
ఎస్ఆర్ పురం మండలం నాయుడుపల్లి వద్ద శనివారం రాత్రి ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పల్లిపట్టు నుండి చిత్తూరు వైపు వేగంగా వెళ్తున్న కారు, ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయింది. ఈ క్రమంలో నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు తీవ్రంగా దెబ్బతినగా, ప్రయాణికులకు స్వల్ప గాయాలతో ప్రాణాపాయం తప్పిందని స్థానిక పోలీసులు వెల్లడించారు.

Comments

G
Loading comments...