వార్తలకు తిరిగి వెళ్లండి

ఎబోలా వైరస్ కలకలంతో తెలంగాణ ప్రభుత్వం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో హై అలర్ట్ ప్రకటించింది. ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు స్క్రీనింగ్ నిర్వహించడంతో పాటు, వారిపై 21 రోజుల పాటు ప్రత్యేక నిఘా ఉంచాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.
తప్పుడు వివరాలిచ్చే విదేశీయులపై కేసులు నమోదు చేయాలని, కమ్యూనికేషన్ కోసం ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యేక భాషా నిపుణులను నియమించాలని స్పష్టం చేశారు. గాంధీ ఆస్పత్రిలోని అనుమానితులకు నెగిటివ్ వచ్చిందని, ప్రజలు ఆందోళన చెందవద్దని మంత్రి తెలిపారు.
Comments
Loading comments...
