వార్తలకు తిరిగి వెళ్లండి

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ భీమేశ్వరాలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. భక్తులు స్వామిని దర్శించుకుని తమ కోడె మొక్కులను భక్తిశ్రద్ధలతో చెల్లించుకున్నారు. రద్దీ దృష్ట్యా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.
ఈ సందర్భంగా ప్రసిద్ధ ప్రవచనకర్త బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి, పీఎం సలహాదారు ఆదిత్య దీక్షిత్ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వారికి వేద ఆశీర్వచనాలతో పాటు తీర్థప్రసాదాలను అందజేశారు.
Comments
Loading comments...
