వార్తలకు తిరిగి వెళ్లండి

కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో కొత్తగా నియమితులైన మంగళ వాయిద్య కళాకారులు మంగలి సుదర్శన్ బాబు, తిరుమల వెంకట అశోక్ నేడు విధుల్లో చేరారు. ఆలయ ఈఓ ఎస్. అంజనారెడ్డి వారికి బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాలతో స్వామివారి నిత్యకైంకర్యాలు, ఉత్సవాల్లో నాదస్వర శోభ పెరగనుంది. దీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న ఈ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయడంపై ఆలయ అధికారులు హర్షం వ్యక్తం చేస్తూ ఆలయ సేవలు మెరుగుపడతాయని తెలిపారు.
Comments
Loading comments...
