Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ హెచ్చరికలైనా వరి సాగుకే రైతులు మొగ్గు

Follow Udayam on Google
Shruthi Nov 02, 2026 8:22 AM నల్గొండGeneral
ప్రభుత్వ హెచ్చరికలైనా వరి సాగుకే రైతులు మొగ్గు  - Udayam
ఎల్‌నినో ప్రభావంతో యాసంగిలో వరి సాగు వద్దని ప్రభుత్వం హెచ్చరించినా రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు. సాగునీటి కొరత ముప్పుతో ఆరుతడి పంటలు వేయాలని అధికారులు సూచించారు. అయినా రైతులు పొలాలు దున్ని నార్లు సిద్ధం చేస్తున్నారు. ఏఎమ్మార్పీ ప్రాజెక్టు పరిధిలో వందల ఎకరాల్లో సాగు పనులు మొదలయ్యాయి. బోరుబావుల్లో నీరుందని రైతులు ధీమా వ్యక్తం చేస్తుండగా, వాతావరణ పరిస్థితులపై వ్యవసాయ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

Comments

G
Loading comments...