వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలో అక్టోబరులో యూపీఐ లావాదేవీల రోజువారీ సగటు విలువ తొలిసారిగా రూ.లక్ష కోట్లు దాటింది. నెల మొత్తంలో 2,547 కోట్ల లావాదేవీలు జరగ్గా, వాటి విలువ రూ.31.53 లక్షల కోట్లకు చేరింది.
గతేడాది అక్టోబరుతో పోలిస్తే లావాదేవీల సంఖ్య 23 శాతం, విలువ 16 శాతం పెరిగింది. పండగల కొనుగోళ్లు, ఆన్‌లైన్ ఆఫర్లు ఈ వృద్ధికి దోహదపడినట్లు అంచనా.
Comments
Loading comments...

