వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో అక్టోబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు 17 శాతం పెరిగి రూ.4,593 కోట్లకు చేరాయి. గతేడాది ఇదే నెలతో పోలిస్తే రూ.679 కోట్ల అదనపు ఆదాయం సమకూరింది. వ్యాట్ వసూళ్లు 31 శాతం వృద్ధితో రూ.3,065 కోట్లకు పెరిగాయి.
ఈ ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ వరకు జీఎస్టీ, వ్యాట్ ఆదాయం రూ.51,563 కోట్లకు చేరింది. సేవలు, ఐటీ, తయారీ, ఔషధ రంగాలు ఆదాయ వృద్ధికి దోహదపడుతున్నాయి.
Comments
Loading comments...

