వార్తలకు తిరిగి వెళ్లండి

కన్నడ నటి రుక్మిణీ వసంత్ ఫోటోలను ఏఐ సాంకేతికతతో అసభ్యంగా మార్ఫింగ్ చేసిన ముగ్గురు కేటుగాళ్లను కర్ణాటక సైబర్ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. ఈ డీప్‌ఫేక్ చిత్రాల వల్ల తాను, తన కుటుంబం తీవ్ర మానసిక ఆవేదనకు గురయ్యామని సదరు నటి ఫిర్యాదు చేశారు.
అరెస్టయిన నిందితులు రవికుమార్, చంద్రకాంత్, రంజిత్‌లను కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం వారికి జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ప్రస్తుతం రుక్మిణి ఎన్టీఆర్ నటిస్తున్న 'డ్రాగన్' సినిమాలో కథానాయికగా నటిస్తున్నారు.
Comments
Loading comments...
