వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
అల్లూరి జిల్లా పాడేరులో మన్యం బంద్ కొనసాగుతోంది. ఆదివాసీ సంఘాలు ఆర్టీసీ జంక్షన్‌లో బైఠాయించి బస్సులు, వాహనాలను అడ్డుకున్నాయి. పోలీసులు వారిని తప్పించి వాహనాలను పంపారు. ప్రయాణికులు లేకుండానే బస్సులు వెళ్లాయి.
జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు, అరకులోయ, డుంబ్రిగూడ, హుకుంపేటలోనూ బంద్ కొనసాగుతోంది. రంపచోడవరంలో దుకాణాలు మూతపడ్డాయి. జీవో 3కు ప్రత్యామ్నాయ జీవో, 1/70 చట్టం అమలు కోరుతూ నినాదాలు చేశారు.
Comments
Loading comments...

