వార్తలకు తిరిగి వెళ్లండి

తోతాపురి మామిడికి కేజీకి రూ. 4 ప్రోత్సాహకం ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించడంతో జీడీనెల్లూరు రైతులు హర్షం వ్యక్తం చేశారు. జైన్ ఫామ్ ఫ్రెష్ ఫ్యాక్టరీ వద్ద టీడీపీ నాయకులు, రైతులు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్నారు.
ప్రభుత్వం రైతులకు అండగా లేదన్న ఆరోపణలను ఈ నిర్ణయం తిప్పికొట్టిందని నాయకులు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని వారు స్పష్టం చేశారు.
Comments
Loading comments...
