Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గర్భిణిని వాగు దాటించిన 108 సిబ్బంది

Follow Udayam on Google
Harika Nov 02, 2026 12:49 PM ఆసిఫాబాద్General
కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణిని 108 సిబ్బంది సాహసోపేతంగా ఆస్పత్రికి తరలించారు. చిలకగూడ గ్రామానికి చెందిన ఆమెను దస్నాపూర్‌ వాగు దాటించి బైక్‌పై అంబులెన్స్‌ వద్దకు తీసుకొచ్చారు. ఈఎంటీలు రమణ, ప్రఫుల్‌ గర్భిణిని ఆసిఫాబాద్‌ ఆస్పత్రిలో చేర్పించారు. మారుమూల గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం లేక అత్యవసర సమయాల్లోనూ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Comments

G
Loading comments...