వార్తలకు తిరిగి వెళ్లండి

మడకశిర కెనరా బ్యాంకు అప్రైజర్ సుందరేష్ ఆచారిని రూ.70.66 లక్షల మోసం కేసులో పోలీసులు అరెస్టు చేశారు. 872 గ్రాముల నకిలీ బంగారం కుదువ పెట్టినట్లు బ్యాంకు తనిఖీలో తేలింది.
ఏడుగురి పేర్లతో 12 రుణ ఖాతాలు సృష్టించి సొమ్ము కాజేశాడు. జల్సాలు, గుర్రపు పందేల కోసం ఖర్చు చేసినట్లు పోలీసులు తెలిపారు. అతడి నుంచి రూ.30.20 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Loading comments...
