వార్తలకు తిరిగి వెళ్లండి

మరాఠీ సంప్రదాయ లవానీ నృత్య కళాకారిణి విఠాబాయి భావూ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఈఠా’ (Eetha) చిత్రం నుండి శ్రద్ధా కపూర్ ఫస్ట్ లుక్ విడుదలైంది. మరాఠీ సాంప్రదాయ గెటప్‌లో ఉన్న శ్రద్ధా లుక్‌కు నెటిజన్ల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.
లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ఈ బయోపిక్ కోసం శ్రద్ధా ఏకంగా 15 కిలోల బరువు పెరగడం విశేషం. భారీ అంచనాలున్న ఈ విజువల్ డ్రామాను రక్షాబంధన్ కానుకగా ఆగస్టు 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.
Comments
Loading comments...
