వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్‌లో మెగా కమర్షియల్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ మొదటివారంలోనే ఈ విమానాశ్రయ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. నిజాం కాలంలో సైనిక అవసరాల కోసం నిర్మించిన ఈ ఎయిర్‌స్ట్రిప్ దశాబ్దాలుగా నిరుపయోగంగా ఉంది.
ఈ మెగా ఎయిర్‌పోర్ట్‌ను మొత్తం 1,062 ఎకరాల్లో నిర్మించనున్నారు. ఇందులో 362 ఎకరాల రక్షణశాఖ భూమి పోగా, మిగిలిన 700 ఎకరాల భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది.
Comments
Loading comments...
