Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారాస ఉచ్చులో పడొద్దు: మంత్రి

Follow Udayam Digital on Google
అశ్విని దేవి Aug 08, 2026 6:39 AM ఆదిలాబాద్తెలంగాణ
భారాస ఉచ్చులో పడొద్దు: మంత్రి - Udayam Digital
నిరుద్యోగులు భారాస ఉచ్చులో పడొద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో 72 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, ఇటీవల 15 వేల వరకు ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు విడుదల చేశామని తెలిపారు. పదేళ్లపాటు నిరుద్యోగులను పట్టించుకోని భారాస ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తోందని మంత్రి విమర్శించారు. నిరుద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Comments

G
Loading comments...