వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలు పెరిగాయి. జిల్లాలోని 21 కళాశాలల్లో గత ఏడాది 2,862 మంది చేరగా, ఈసారి ఇప్పటివరకు 3,127 మంది ప్రవేశాలు పొందారు. ఆగస్టు 15 వరకు మరిన్ని అడ్మిషన్లు జరిగే అవకాశం ఉంది.
ఖమ్మం నగరంలోని మూడు ప్రభుత్వ కళాశాలల్లో సీట్లన్నీ భర్తీ అయ్యాయి. మౌలిక వసతులు, డిజిటల్ తరగతులు, అల్పాహారం, మధ్యాహ్న భోజనంపై ప్రచారం ప్రభావం చూపినట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...
