Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హవాలా సొమ్ము పట్టివేత

Follow Udayam Digital on Google
Ravi Kumar May 28, 2026 5:30 PM హైదరాబాద్తెలంగాణ
హవాలా సొమ్ము పట్టివేత - Udayam Digital
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్ పరిధిలో జీఆర్పీ, ఆర్పీఎఫ్‌ పోలీసులు తనిఖీలు నిర్వహించి రూ.1.22 కోట్ల హవాలా నగదును స్వాధీనం చేసుకున్నారు. ముంబై నుంచి దేవగిరి ఎక్స్‌ప్రెస్‌లో ఈ సొమ్మును తరలిస్తున్న మహారాష్ట్రకు చెందిన విజయ్ అంబాదాస్ గుప్తాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నగదును సికింద్రాబాద్ మోండామార్కెట్‌లోని ఓ వ్యాపారికి అప్పగించేందుకు తీసుకెళ్తున్నట్లు నిందితుడు అంగీకరించాడు. బ్యాగులో సరైన రసీదులు లేకపోవడంతో నగదును ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగించారు.

Comments

G
Loading comments...