Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మానవతా దృక్పథం చాటుకున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం.. అనాథ బాలికలకు గురుకుల ప్రవేశం

Follow Udayam Digital on Google
Super Admin Jul 27, 2026 1:57 PM జగిత్యాలతెలంగాణ
మానవతా దృక్పథం చాటుకున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం.. అనాథ బాలికలకు గురుకుల ప్రవేశం - Udayam Digital
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన కనక శారద అనే మహిళ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. తల్లిని కోల్పోయి నిరాశ్రయులైన నలుగురు అనాథ ఆడపిల్లల దీనస్థితిని తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వెంటనే స్పందించారు.​సోమవారం నాడు ఆ నలుగురు పిల్లల్లో ఇద్దరు బాలికలకు తాటిపల్లి గురుకుల పాఠశాలలో ప్రవేశం కల్పించారు. ఈ సందర్భంగా బాలికల ఉన్నత చదువులకు, భవిష్యత్తుకు పూర్తి భరోసా కల్పిస్తూ అండగా ఉంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ మానస కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బత్తిని శ్రీనివాస్ గౌడ్,ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...