వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం జిల్లా రాప్తాడులో హేమంత్‌పై పోలీసుల కాల్పుల ఘటనపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ ఏపీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. వీడియో ఫుటేజ్, సీసీటీవీ రికార్డులు, వైద్య నివేదికలు భద్రపరచాలని పిటిషనర్ కోరారు.
హేమంత్ వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్ ముందు నమోదు చేసి, ఫోరెన్సిక్ ఆధారాలు పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. పిల్‌పై రేపు విచారిస్తామని హైకోర్టు తెలిపింది.
Comments
Loading comments...

