వార్తలకు తిరిగి వెళ్లండి

రేవంత్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మూడో స్థానానికి పడిపోతుందని కేటీఆర్ జోస్యం చెప్పారు. త్వరలోనే కేసీఆర్ బస్సు యాత్ర చేపడతారని, పార్టీ తప్పులను సరిదిద్దుకుని ప్రజల్లోకి వెళ్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
మోదీ 12 ఏళ్ల పాలనతో దేశానికి ఒరిగిందేమీ లేదని కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వం హామీలను విస్మరించి, ప్రజాధనంతో ముఖ్యమంత్రి సొంత రాజసౌధాన్ని నిర్మించుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...
