వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన భేటీ కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, విభజన హామీలు, పలు కీలక ప్రాజెక్టులపై ప్రధానితో చర్చించే అవకాశం ఉంది.
అలాగే రాత్రి 7 గంటలకు కేంద్రమంత్రి ఖట్టర్‌తో కూడా సీఎం సమావేశం కానున్నారు. నేడు ప్రధాని అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొనేందుకు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే.
Comments
Loading comments...
